Monday, September 23, 2019
Follow Us on :

కోహ్లీ తండ్రి మరణించినప్పుడు వచ్చి.. ఓదార్చింది ఆయనే..!

By BhaaratToday | Published On Aug 24th, 2019

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధితో బాధపడ్డ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. జైట్లీ మరణవార్తను ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం అధికారికంగా ప్రకటించింది. అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారని ప్రకటించడానికి చింతిస్తున్నామని తెలిపింది. మధ్యాహ్నం 12.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ వెల్లడించింది. 


ఆయన మరణంపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని  వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా పంచుకున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అరుణ్ జైట్లీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. అరుణ్ జైట్లీ మృతి పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.  అరుణ్ జైట్లీ గారు పోయారన్న వార్త తెలియగానే ఎంతో విచారం కలిగిందని కోహ్లీ ట్వీట్ చేశాడు. 2006లో తన తండ్రి చనిపోయినప్పుడు జైట్లీ తన ఇంటికి వచ్చి పరామర్శించారని, ఆ సమయంలో ఎంతో బిజీగా ఉన్నా, అన్ని పనులు వాయిదా వేసుకుని తమ నివాసానికి వచ్చి సంతాపం తెలియజేశారని కోహ్లీ గుర్తు చేసుకున్నారు. ఆయనది ఎంతో మంచి స్వభావం అని, ఇతరులకు సాయపడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారని కోహ్లీ అన్నాడు.