Monday, September 23, 2019
Follow Us on :

2025 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో పాక్ తరపున విరాట్ కోహ్లీ.. పాక్ ఓవరాక్షన్ వీడియో

By BhaaratToday | Published On Sep 6th, 2019

ఏ దేశమైనా తమ డిఫెన్స్ డే రోజు.. తమ దేశ సైన్యం గొప్పతనాన్ని, వారి వద్ద ఉన్న ఆయుధాలను ప్రదర్శించడం మామూలే..! ఆయా దేశాలకు చెందిన వారు కూడా తమ దేశ గొప్పతనం ఏమిటో తెలియజేయాలి. అంతా వద్దనుకుని పక్క దేశం మీద అక్కసు వెళ్లగక్కితే ఎలా ఉంటుందంటే.. చూసే వాళ్లకు కూడా వెగటుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పుకొంటోంది పాకిస్థాన్ గురించే..! 

Image result for virat kohli playing for pakistan

పాకిస్థాన్ డిఫెన్స్ డే రోజున ఓ వీడియో అక్కడి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో 2025 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో పాకిస్థాన్ తరపున విరాట్ కోహ్లీ ఓపెనింగ్ బ్యాటింగ్ కి వచ్చినట్లు చూపిస్తోంది. అదేంటి పాకిస్థాన్ కు ఓపెనర్ గా విరాట్ కోహ్లీ వెళ్లడం అని అనుకుంటారా.. అదే ఈ వీడియోలో పాకిస్థాన్ చేస్తున్న వెటకారం. ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా.. శ్రీనార్ స్టేడియంలో పాక్ టీమ్‌లో బాబర్ అజామ్, విరాట్ కోహ్లీ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు ఓపెనింగ్ చేయబోతున్నారంటూ కామెంట్రీ వినిపిస్తూ ఉంటుంది. మ్యాచ్‌ని చూస్తున్న పాప ‘ఈరోజు విరాట్ కోహ్లీ మ్యాచ్‌ని గెలిపిస్తాడని తన తండ్రితో చెప్తుంది. ఆమె తండ్రి ‘విరాట్ కోహ్లీ గతంలో భారత్‌కి ఆడేవాడు’ అని చెబుతాడు. పక్కనే ఉన్న అతని కొడుకు.. ఆశ్చర్యంగా.. ‘ కౌన్ ఇండియా ?’ అని ప్రశ్నిస్తాడు. దానికి ఆ తండ్రి ఓ స్మైల్ ఇస్తాడు. ఆ తర్వాత గ్రీన్ కలర్ లో ఉన్న పాకిస్థాన్.. ఆరెంజి కలర్ లో ఉన్న భారత్ ను పూర్తిగా గ్రీన్ కలర్ లోకి మార్చేస్తూ.. సెప్టెంబర్ ఆరు పాకిస్థాన్ డిఫెన్స్ డే అంటూ యాడ్ ముగుస్తుంది. 

గతంలో.. అభినందన్ 'కప్' విషయంలో ఇలాగే ఓవరాక్షన్ చేసిన పాకిస్థాన్.. ఇప్పుడు కూడా మరోసారి భారత్ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.