Saturday, October 19, 2019
Follow Us on :

తప్పు చేసిన కోహ్లీ.. జాగ్రత్త బాస్

By BhaaratToday | Published On Sep 24th, 2019

విరాట్ కోహ్లీ.. అంటేనే దూకుడైన ప్రవర్తన..! ఇటీవలి కాలంలో కాస్త తగ్గించాడు అని అనుకుంటున్నారు..  కానీ సౌత్ ఆఫ్రికాతో బెంగళూరులో జరిగిన టీ20లో మరోసారి పూర్వపు కోహ్లీని మనకు చూపించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ బ్యాట్ ఝుళిపించడానికి దక్షిణాఫ్రికా బౌలర్లు అసలు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో కోహ్లీ కయ్యానికి కాలుదువ్వాడు. బ్యూరాన్ హెండ్రిక్స్ ను కావాలనే ఢీకొట్టాడు కోహ్లీ. ఆ సమయంలో ఒకింత షాక్ అయ్యాడు బ్యూరాన్ హెండ్రిక్స్. నా తప్పేమీ లేకున్నా కూడా కోహ్లీ ఇలా చేశాడేంటబ్బా అన్న ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు  బ్యూరాన్ హెండ్రిక్స్.  

Image result for virat kohli beuran hendricks

ఈ ఘ్టనపై కోహ్లీ కూడా తన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో మ్యాచ్ రిఫరీ కోహ్లీని మందలించాడు. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవల్ 1 తప్పిదం కావడంతో కోహ్లీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ చేరింది. కోహ్లీకి ఇప్పటికే రెండు డీమెరిట్ పాయింట్లున్నాయి. రెండేళ్ల వ్యవధిలో ఓ క్రికెటర్ ఖాతాలో నాలుగు డీమెరిట్ పాయింట్లు చేరితే ఓ సస్పెన్షన్ పాయింటుగా మారుతుంది. రెండు సస్పెన్షన్ పాయింట్లు ఉన్న ఆటగాన్ని ఓ టెస్టు కానీ, రెండు వన్డేలు కానీ, రెండు టి20 మ్యాచ్ లు ఆడకుండా చేయొచ్చు. కాబట్టి కోహ్లీ కాస్త జాగ్రత్త పడితే బాగుంటుంది.. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ త్వరలోనే రాబోతోంది.