Saturday, August 24, 2019
Follow Us on :

విశాఖ‌లో ఎన్‌కౌంట‌ర్‌

By BhaaratToday | Published On Mar 16th, 2019

విశాఖ జిల్లాలో మావోయిస్టులు-పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. అలాగే ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పెదబయలు మండలం పి. కొండాపల్లి గ్రామానికి సమీపంలోగల అడవుల్లో శనివారం తెల్లవారుజామున ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా స్పెషల్ పార్టీ పోలీసులు పెదబయలు మండలంలోగల అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే... పోలీసులకు మావోయిస్టులు ఎదురుప‌డ‌టంతో వీరి మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గాయపడ్డ కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం విశాఖకు తరలించారు. అలాగే ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.