Tuesday, June 18, 2019
Follow Us on :

ఎగ్జిట్ పోల్స్ పై ట్వీట్ చేసి వివేక్ ఒబెరాయ్ తప్పు చేశాడా..?

By BhaaratToday | Published On May 20th, 2019

ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ గురించి ఎవరికి తోచిన కామెంట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చే అవకాశాలే ఎక్కువ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ పై నటుడు వివేక్ ఒబెరాయ్ చేసిన ట్వీట్ తీవ్ర విమర్శలపాలు చేస్తోంది. 

 

వివేక్ ఒబెరాయ్ తన ట్వీట్ లో ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్తూ.. ఐశ్వర్యా రాయ్ సల్మాన్ ఖాన్ తోనూ, వివేక్ ఒబెరాయ్ తోనూ, ప్రస్తుతం తన భర్త అభిషేక్ బచ్చన్ తోనూ ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అప్పట్లో ఐష్ సల్మాన్, వివేక్ ఒబెరాయ్ లతో స్నేహంగా మెలిగిన విషయాలను మరోసారి గుర్తు చేస్తూ వివేక్ ఈ పోస్టు పెట్టాడు. అక్కడితో ఆగకుండా.. నవ్వుతూ .. ఇక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడడం లేదని.. జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నానని.. ఈ పోస్ట్ క్రియేట్ చేసిన వారికి థమ్స్ అప్ అని చెప్పుకొచ్చాడు. అయితే ఇది చాలా వరకూ నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది. 

ఐశ్వర్య ప్రస్తుతం తన కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది. ఇలాంటి తరుణంలో వివేక్ ఇలాంటి పోస్టు పెట్టడం ఏమీ బాగోలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. బాలీవుడ్ యాక్ట్రెస్ సోనమ్ కపూర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక నేషనల్ కమీషన్ ఫర్ విమెన్ కూడా ఈ పోస్టుపై వివేక్ ఒబెరాయ్ కు నోటీసులు పంపించింది.