Tuesday, May 21, 2019
Follow Us on :

ఆమె ప్ర‌వ‌ర్త‌న స‌ద్దాం హుస్సేన్‌ ప్ర‌వ‌ర్త‌న‌లా ఉంది.. ఎందుక‌లా..

By BhaaratToday | Published On May 15th, 2019

బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ అధినేత్రి మమతా బెనర్జీపై ట్విట‌ర్ వేధిక‌గా విరుచుకుప‌డ్డారు. మమత బెనర్జీ ఇరాక్ మాజీ నియంత స‌ద్దాం హుస్సేన్‌లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ట్విట్ చేశారు. ‘ గౌరవనీయులైన ఒక మ‌హిళ‌ ఇరాక్‌ మాజీ నియంత స‌ద్దాం హుస్సేన్ లా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. దీదీ తనకు తానే ప్రజాస్వామ్యానికి ముప్పులా పరిణమించారని.. మొదట ప్రియాంక శర్మను, ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ బగ్గాను నిర్భందించారని.. బెంగాల్‌ను రక్షించాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని  వివేక్‌ ట్విట్ లో కోరారు. 

కాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ బగ్గాను గృహ నిర్భంగా చేశారు. ఈ నేపథ్యంలోనే వివేక్‌ పైరకంగా స్పందించారు. హిందూ ఉగ్రవాదంపై మక్కల్‌ నీదీ మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలను కూడా వివేక్‌ ఒబెరాయ్‌ తప్పుపట్టిన సంగతి తెలిసిందే.