Thursday, July 18, 2019
Follow Us on :

ఏపీలో క‌ల‌క‌లం రేపుతున్న వీవీప్యాట్ స్లిప్పులు

By BhaaratToday | Published On Apr 16th, 2019

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జడ్పీ పాఠశాల ఆవరణలో వీవీప్యాట్ స్లిప్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయమై తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల ఈవీఎం కమిషనింగ్ సెంటర్ మాత్రమేనని, బయటపడిన స్లిప్పులు అసలు పోలింగ్ రోజువే కాదని స్ప‌ష్టం చేశారు. ఎవరో ఉద్యోగి వీవీప్యాట్ స్లిప్పులను కావాలని బయట పడేశారని, దీనికి ఆత్మకూరు ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమని చెప్పారు. వెయ్యి ఓట్లను బెల్ ఇంజినీర్లు పోలింగ్‌కు ముందు పోల్ చేశారని, ఈవీఎంలు సరిగా పని చేస్తున్నాయని నిర్థారించుకున్న మీదటే పోలింగ్ కేంద్రాలకు తరలించామని ద్వివేది వివ‌రించారు.