Monday, November 18, 2019
Follow Us on :

వార్.. వసూళ్ళ ప్రభంజనం

By BhaaratToday | Published On Oct 15th, 2019

యాక్షన్ హీరోలు టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా వార్...మెదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తోంది....ఇప్పటికే ఈ సినిమా ఒక ప్రెస్టేజియస్ మార్కు ను దాటింది.

వార్.... బాలివుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా...ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 వ తేదీన విడుదల చేశారు....వాణి కపూర్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండే మంచి హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్ళ వరద కురిపిస్తోంది....విడుదలైన మొదటి రోజే 53 కోట్లు వసూలు చేసింది వార్ సినిమా...దానికి కారణం బాలీవుడ్ టాప్ హీరోస్ చేసిని సినిమా కావడమే...

ఈ సినిమా కు పోటీగా పాన్ ఇండియా మూవీగా వచ్చిన సినిమా సైరా...మెగాస్టార్ హీరోగా , బాలివుడ్ టాప్ హీరో అమితాబ్ , కిచ్చా సుధీప్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మొదటి నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మినహా ఎక్కడా కలెక్షన్ల ప్రభావం కనిపించలేదు... దాంతో వార్ సినిమా కు పోటీ లేకుండా పోయింది...

సైరా ప్రభావం లేకపోవడంతో వార్ సినిమా కలెక్షన్లు పరంగా దూసుకెళ్తుంది...ఈ సినిమా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది...విడుదలైన రెండు వారల్లోనే దాదాపు 300 కోట్ల మార్కెట్ ను చేరుకుంది...హృతిక్ రోషన్ స్టామినాను మరోసారి బాలీవుడ్ కు రుచి చూపించారు.... యష్ రాజ్ ఫిలీంస్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు , హిందీ, తమిళ భాషల్లో విడుదల అయ్యింది.