Wednesday, October 16, 2019
Follow Us on :

వర్షం వచ్చేలా ఉంది..! ఈ రెండు రోజులు జాగ్రత్త..!!

By BhaaratToday | Published On Feb 10th, 2019

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులు వర్షం కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా ప్రాంతాల్లో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు కోమరిన్‌ నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి ఉంది. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. మాల్దీవుల నుంచి తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు చాన్స్ ఉందని వారు తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఇప్పటికే రాత్రి పూట ఉష్ణోగ్రతలు సగటు కన్నా తగ్గాయని అన్నారు. కాగా, గడిచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్ లో 18 నుంచి 20 డిగ్రీల వరకూ ఉన్న రాత్రిపూట ఉష్ణోగ్రత, గత రాత్రి 15 డిగ్రీలకు పడిపోయింది. చాలా ప్రాంతాలను పొగమంచు కమ్మేయడంతో, రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.