Thursday, December 12, 2019
Follow Us on :

ఒకవేళ బౌండరీలు కూడా సమానం అయి ఉండి ఉంటే..?

By BhaaratToday | Published On Jul 15th, 2019

వన్డే క్రికెట్ పోరులో ఇంగ్లండ్‌ జట్టు జగజ్జేతగా నిలిచింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌ విజేతగా నిలవడం ఇదే మొద‌టిసారి. 1979, 1987, 1992లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న ఇంగ్లండ్‌ ఎట్ట‌కేల‌కు ఈసారి కప్ లాక్కెల్లింది. 45 ఏళ్ల ఇంగ్లండ్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ జట్టు చిరకాల స్వప్నం నెరవేరింది. నాలుగున్నర దశాబ్దాల వరల్డ్‌కప్‌ చరిత్రలో మూడుసార్లు ఫైనల్‌కు చేరినా ఎన్నడూ ట్రోఫీని ముద్దాడని ఇంగ్లండ్‌ జట్టు ఆశ, ఆ దేశ అభిమాని ఆకాంక్ష తీరిపోయింది. ఇంగ్లండ్‌ జట్టు విశ్వవిజేతగా నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కూడా 50 ఓవర్లలో 241 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో ఫస్ట్ ఇంగ్లండ్‌ బ్యాటింగ్ చేసింది. ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కూడా ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. బౌండరీలు ఎక్కువగా కొట్టారన్న కారణంతో ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు. ఒకవేళ బౌండరీలు కూడా సమానమైతే అన్నది అందరికీ ఎదురవుతున్న డౌట్..! 

 ఇలాంటి సమయంలో కేవలం ప్రధాన మ్యాచ్‌ బౌండరీలను మాత్రమే లెక్కిస్తారు. అవి కూడా సమానమైతే.. సూపర్‌ ఓవర్‌ చివరి బంతి నుంచి ఇరు జట్లు సాధించిన పరుగులను పరిగణలోకి తీసుకొని ఎక్కువ రన్స్‌ చేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారన్నమాట..! 

ప్రస్తుతం ఇలాంటి నిబంధనలను మార్చాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ ఎక్కువ బౌండరీలు కొడితే.. కివీస్ ఎక్కువ వికెట్లను తీసిందని.. వాటికి వ్యాల్యూ లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.