Wednesday, October 16, 2019
Follow Us on :

భారతీయ జనతా పార్టీలో చేరిన రవీంద్ర జడేజా భార్య

By BhaaratToday | Published On Mar 4th, 2019

భారతీయ జనతా పార్టీలోకి పలువురు ప్రముఖులు వచ్చి చేరుతున్నారు. భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య భారతీయ జనతా పార్టీలో చేరడం విశేషం.  రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనకు స్ఫూర్తి అని, అందుకే తాను బీజేపీలో చేరినట్టు రివాబా జడేజా తెలిపారు. గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి ఆర్‌సీ ఫల్దు, ఎంపీ పూనం సమక్షంలో వీరు కాషాయ కండువా కప్పుకున్నారు. జామ్ నగర్ లో జరిగిన చిన్న కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. 

Image result for rivaba jadeja news

రాజకీయాల్లోకి రాక ముందు రివాబా జడేజా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో కూడా ఆమె తనకు ప్రజా సేవ చేయాలని ఎప్పుడో ఒకరోజు రాజకీయాల్లోకి వస్తానని చెప్పేవారు. అనుకున్నట్లుగానే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.  రివాబా గతంలో కర్ణి సేన ఉమెన్స్ వింగ్ ఛీఫ్ గా పనిచేశారు. రివాబా 2016లో రవీంద్ర జడేజాను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కుమార్తె ఉంది. రివాబా రాజ్ కోట్ లోని రవీంద్ర జడేజా రెస్టారెంట్ బిజినెస్ లు చూసుకుంటూ ఉంటారు. రవీంద్ర జడేజా ప్రస్తుతం భారత వన్డే జట్టులో కొనసాగుతూ ఉన్నాడు.  

Related image