Tuesday, May 21, 2019
Follow Us on :

స‌న్ రైజ‌ర్స్ కు బ్యాడ్ న్యూస్

By BhaaratToday | Published On Mar 12th, 2019

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్‌ విలియమ్‌సన్ గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. వెల్లింగ్‌టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. విలియమ్‌సన్ గాయపడ్డాడు. బంతిని ఆపేందుకు డైవ్ చేస్తుండగా ఎడమ భుజానికి గాయమైంది. దీంతో సోమవారం అతడిని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని జట్టు కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపారు. ‘‘ఇది అంత పెద్ద గాయం కాదు. అంత సజావుగా జరిగితే అతను ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే అతను 100శాతం కోలుకుంటాడని కచ్చితంగా చెప్పలేము. అతను పూర్తిగా కోలుకున్న తర్వాతే ఫ్లైట్ ఎక్కుతాడు’’ అని ఆయన పేర్కొన్నారు.


Image result for kane williamson