Tuesday, June 18, 2019
Follow Us on :

16 లక్షల కారును అలికేసింది.. ఎందుకంటే..!

By BhaaratToday | Published On May 21st, 2019

16 లక్షల కారు.. ఆవు పేడతో మొత్తం అలికేశారు..! ఇదంతా ఎందుకు చేశారు అని ఆమెను అడిగితే.. వచ్చిన సమాధానం విని షాక్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో ఎండలు విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే..! బైక్ సీట్ల మీద మనోళ్లు ఏకంగా దోశెలు వేసేస్తున్నారు. ఇక ఎండలో ఉన్న కారు మీద కూడా అదే రకమైన ప్రభావం ఉంటుంది. తమ కారు పాడవకుండా.. మరీ వేడి అవ్వకుండా ఉండేందుకే ఇలా చేశారట..! ఆమె అలా అలికేసిన కారు ధర(Toyota Corolla Altis) దాదాపు 16 లక్షలు ఉంటుంది. 


గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌కు చెందిన కారు ఓనర్ ఇలా చేశారు. అయితే కారు మాత్రం మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉంది. వేడికి కారుకు ఏమీ కాకుండా ఉండడం కోసం  కారును ఆవుపేడతో అలికేసింది ఆ ఇల్లాలు. ఇలా చేయడం వల్ల బయట వేడి కారు లోపలికి వచ్చే అవకాశం లేదని ఓనర్ చెప్పడం విశేషం. అహ్మదాబాద్‌కు చెందిన మహిళ సేజల్ షా ఇలా చేశారు. ఆ కారును ఫొటో తీసి కొందరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. అక్కడ 45 డిగ్రీల ఉష్ణోగ్రత  ఉండడంతోనే ఆమె ఈ పని చేశారట..!  

Ahmedabad Car Owner Covers Car With Cow Dung To Protect It From The Heat