Sunday, August 18, 2019
Follow Us on :

క‌ష్టాల్లో కివీస్.. ఇక భార‌మంతా టేల‌ర్‌పైనే..

By BhaaratToday | Published On Jul 14th, 2019

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు భారీ షాక్‌ తగిలింది. సారథి విలియమ్సన్‌(30)ను ఫ్లంకెట్‌ను ఔట్‌ చేసి కివీస్‌ను కష్టాల్లో పడేశాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో కివీస్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచిన విలియమ్సన్‌ స్వల్పస్కోర్‌కే వెనుదిరగడం కివీస్‌ ఎదురుదెబ్బే​. ఇక సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ ఇన్నింగ్స్‌పైనే కివీస్‌ ఆధారపడి ఉంది. కివీస్ ఇన్నింగ్స్ కు వెన్నుముక‌లా నిలిచిన నికోల‌స్ ప్లంకెట్ బౌలింగ్ లో అవుట‌య్యాడు. ప్రస్తుతం కివీస్ 27 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. టామ్ లాథ‌మ్ ప‌రుగులేమి చేయ‌కుండా, టేలర్ 5 పరుగుల‌తో క్రీజులో ఉన్నారు.