Wednesday, October 16, 2019
Follow Us on :

వరల్డ్ లో అయిదుగురు బెస్ట్ ఫీల్డర్లను సెలెక్ట్ చేసిన జాంటీ రోడ్స్.. నంబర్ వన్ మనోడే..!

By BhaaratToday | Published On Feb 14th, 2019

జాంటీ రోడ్స్.. క్రికెట్ లో ఇతడో సంచలనం. ఫీల్డింగ్ తోనే జట్టుకు అద్భుతమైన విజయాలను అందించాడు జాంటీ రోడ్స్..! ఫీల్డింగ్ అంటే ఇలాగే ఉండాలి అని ఓ ట్రెండ్ సృష్టించాడు అప్పట్లో..! ఫీల్డర్ గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం అంటే మాటలా చెప్పండి.. అది చేసి చూపించాడు జాంటీ రోడ్స్. రిటైర్ అయిన తర్వాత కూడా ఫీల్డింగ్ కోచ్ గా తన సేవలను అందించాడు జాంటీ రోడ్స్.

అయితే ఇటీవల జాంటీ రోడ్స్ తో ఐసీసీ చిన్న చిట్ చాట్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అతడు చూసిన క్రికెటర్లలో బెస్ట్ ఫీల్డర్లను ఓ అయిదుగురి పేర్లను సెలెక్ట్ చేయమని అడిగారు. జాంటీ రోడ్స్ సెలెక్ట్ చేసిన అయిదుగురు ఆటగాళ్లలో ఐదో స్థానంలో ఆండ్రు సైమండ్స్, నాలుగో స్థానం గిబ్స్, మూడో స్థానం కాలింగ్ వుడ్, రెండో స్థానం ఏబీ డివిలియర్స్  అని.. మొదటి స్థానంలో మాత్రం సురేష్ రైనానే అని జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు. సురేష్ రైనా ఫీల్డింగ్ అద్భుతమని.. పరుగులు ఆపడానికి ఎంత కష్టమైనా ప్రయత్నిస్తాడు రైనా అని కితాబు ఇచ్చాడు జాంటీ రోడ్స్. ఐపీఎల్ లోనూ.. ఇంటర్నేషనల్ క్రికెట్ లోనూ సురేష్ రైనా అద్భుతమైన క్యాచ్ లు అందుకున్నాడని జాంటీ రోడ్స్ చెప్పాడు. పవర్ ప్లే సర్కిల్ లో అయినా.. స్లిప్ ఫీల్డర్ గా అయినా.. బౌండరీ లైన్ లో అయినా.. సురేష్ రైనా ఫీల్డింగ్ అద్భుతంగా ఉంటుందని జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు.