Wednesday, October 16, 2019
Follow Us on :

ప్రపంచ కుబేరుల భద్రత ఖర్చు ఎంతో తెలుసా..?

By BhaaratToday | Published On Feb 13th, 2019

వేల కోట్ల రూపాయలతో వ్యాపారం.. ఊపిరి తీసుకోవడానికి వీల్లేనంత పని.. వ్యక్తిగత భద్రతకు సమయం దొరక్కపోవడం.. దీంతో ఆ కుబేరులు తమ రక్షణ చూసుకోవడానికి భారీ మొత్తాలను వెచ్చిస్తున్నారు. అయితే, అది భౌతిక భద్రతను మాత్రమే కల్పిస్తుంది. అయినా వారి వ్యక్తిగత భద్రత అంతంత మాత్రమే! ఇంతకీ బిలియనీర్లు తమ వ్యక్తిగత భద్రతకు ఎంత ఖర్చు చేస్తుంటారు? వారికి భద్రత ఏ స్థాయిలో ఉంటుంది?  బిలియనీర్లు భద్రత కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. కమాండోలు, సైనిక అధికారులు, గూఢచార సంస్థల ఉద్యోగులు, మొస్సాద్‌ ఏజెంట్లు, స్వాట్‌ బృందాల సభ్యులు కూడా రిటైర్మెంట్‌ తర్వాత ప్రముఖల భద్రతా సిబ్బందిలో చేరిపోతున్నారు. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ 2017లో వ్యక్తిగత భద్రత కోసం 7.3 మిలియన్‌ డాలర్లను వెచ్చించారు. మాజీ సీక్రెట్‌ సర్వీసు ఏజెంట్లు ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది 10 మిలియన్‌ డాలర్లు వెచ్చించనున్నారు. ఈ మొత్తం చాలా దేశాల అధ్యక్షుల కంటే చాలా ఎక్కువ. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ గతేడాది దాదాపు 1.6 మిలియన్‌ డాలర్లను భద్రత కోసం ఖర్చుచేశారు. ఆయన‌ కుటుంబ ఫౌండేషన్‌ కూడా భద్రతపై చాలా మొత్తం ఖర్చు చేసింది. భారత్‌కు చెందిన అపర కుబేరుడు ముఖేష్‌ అంబానీ భద్రతకు రూ.20 లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు. ఆయనకు జెడ్‌ కేటగిరి భద్రత ఉంది. ఆపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ భద్రతకు ఏటా రూ.1.5 కోట్లు ఖర్చవుతున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ గురూ వారెన్‌ బఫెట్‌ తన భద్రతకు ఏటా రూ.2.60 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. అంటే రోజుకు దాదాపు రూ.69 వేలు అన్నమాట!!