Thursday, October 17, 2019
Follow Us on :

జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం ఎప్పుడంటే..!

By BhaaratToday | Published On May 23rd, 2019

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల‌ 30 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఈ నెల 25న తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం జ‌ర‌గ‌నుంది. పలువురు ప్రముఖులు వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పినట్లు తెలుస్తోంది. కొద్ది సేప‌టి క్రిత‌మే విశాఖ‌లోని శారదాపీఠాధిపతితో వైఎస్ జగన్ ఫోన్‌లో మాట్లాడి ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పటికే 150 స్థానాల్లో వైసీపీ లీడ్‌లో ఉంది. మరోవైపు టీడీపీ 24 స్థానాల్లో లీడ్‌లో ఉంది. జనసేన సింగిల్‌ సీటులోనే లీడ్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. టీడీపీ 2 స్థానాలకే పరిమితమైంది. కాగా ఇంత వరకూ జనసేన మాత్రం ఖాతా తెరవకపోవడం గమనార్హం.