Thursday, August 22, 2019
Follow Us on :

ఎన్నిక‌ల వేళ వ‌రాలు కురిపించిన జ‌గ‌న్‌

By BhaaratToday | Published On Apr 5th, 2019

పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ కానుక ప్రకటించారు. పేదవారు మొదలుకొని ఏడాదికి రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కొత్తగా యూనివర్సల్‌ హెల్త్‌ కార్డులు తీసుకువస్తానని ప్రకటించారు. అంటే నెలకు రూ. 40 వేల వరకు జీతం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు చేయిస్తామని తెలిపారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు వాళ్లందరిని యూనివర్సల్‌ హల్త్‌ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీలోకి తీసుకువస్తామన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో తానే ఈ పథకాన్ని దగ్గరి ఉండి పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్రైవేటు విద్యాసంస్థలో ఫీజులను నియంత్రిస్తామన్నారు. గుంటూరులో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన జ‌గ‌న్ ఈ హామీల‌ను ప్ర‌క‌టించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తాఫాను, గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఏసురత్నంను, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్‌రెడ్డిని గెలిపించమని కోరారు.

గుంటూరు జిల్లాలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయ‌ని, రోడ్లు తవ్వి పూడ్చకుండా వదిలివేశార‌ని, ఈ నిర్లక్ష్యం కారణంగా తాగునీటి పైపుల్లోకి మురుగు నీరు చేరి డయేరియా వచ్చి 32 మంది చనిపోలేదా?. ప్రతిపక్షం ఆందోళన చేస్తే తప్ప చంద్రబాబు మనుషులు చనిపోయినట్టు ఒప్పుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే ఉన్న గుంటూరులోనే పరిస్థితి ఇలా ఉంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.