
కొద్ది సేపట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా ముందుకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీలో ఓట్ల లెక్కింపులో వైసీపీ సుడిగాలిలా దూసుకుపోతోంది. అన్ని స్థానాల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో దూసుకుపోతోంది. 152 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉండగా, టీడీపీ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే లోక్ సభ స్థానాల్లో కూడా వైసీపీ ముందంజలో దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.