Sunday, August 25, 2019
Follow Us on :

వైసీపీ నేత బీజేపీలో చేరబోతున్నారా..?

By BhaaratToday | Published On Jul 16th, 2019

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ నుండి కూడా బీజేపీ లోకి నాయకులు వెళ్ళడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం లోకి వచ్చి కేవలం కొన్ని నెలలు మాత్రమే అవుతోంది.. అలాంటిది ఆ పార్టీ నాయకులు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తుండడంతో అందరూ షాక్ అవుతున్నారు. 

Image may contain: 10 people, outdoor

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వైసీపీ నేత తోట వాణి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఎంపీ సుజనా చౌదరి ద్వారా బీజేపీలో చేరేందుకు ఆమె నిర్ణయించుకున్నారట..! ఏపీలో తోట వాణి బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత.. ఆమె పార్టీ మారితే ఆ నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద దెబ్బే తగిలే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీగా మారడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.. ఆ దిశగా ఇప్పటికే పావులు కదుపుతోంది.   
Image may contain: 9 people, people sitting and outdoor