Saturday, August 24, 2019
Follow Us on :

ఆ వ్యాఖ్య‌ల‌కు క్షమాపణ చెబితే.. నేనూ క్షమాపణ చెప్తా..

By BhaaratToday | Published On Jun 13th, 2019

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘బంట్రోతు అంటే సేవకుడు అని అర్థం. గతంలో వైఎస్‌ను నరరూప రాక్షసుడు అన్నారు. అప్పటి వ్యాఖ్యలకు క్షమాపణ చెబితే... నేనూ క్షమాపణ చెప్తా. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లెకు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. గతంలో స్పీకర్ ఎన్నికల సందర్భంగా నోట్ పంపామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కోడెలను స్పీకర్‌గా ఎన్నుకోగానే జగన్ స్వయంగా చేయిపట్టుకుని సీటు వరకూ వచ్చి కూర్చోబెట్టారు. ఆ రోజున టీడీపీ కంటే వైసీపీ నేతలు ఎక్కువ సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు ఓ బలహీనవర్గానికి చెందిన ఎమ్మెల్యేను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టేందుకు టీడీపీ నేతలకు మనసు రాలేదు. వీళ్లా సభాసంప్రదాయాల గురించి మాట్లాడేది. స్పీకర్ బలహీనవర్గాలకు చెందినవారు కాబట్టే... మీ చేయి పట్టుకోవడానికి టీడీపీ నేతల మనసు ఒప్పుకోవడం లేదని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు.
 
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు శాసనసభలో దుమారం రేపాయి. భాస్కర్‌రెడ్డికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీ వర్గానికి చెందిన అచ్చెన్నాయుడును బంట్రోతు అంటారా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత అహంభావం ఉంటే చెవిరెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానిస్తారని మండిపాడ్డారు.