Tuesday, May 21, 2019
Follow Us on :

మీ ప్రాణాలు పోయే పరిస్థితే ఉంటే ఆ స్థానంలో ఇక మీరెందుకు

By BhaaratToday | Published On Mar 30th, 2019

ఇంటెలిజెన్స్ చీఫ్ లేనంత మాత్రాన  చంద్రబాబు ప్రాణాలు పోతాయా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడటం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం వంటి పనులకు పాల్పడుతోందని ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి సహా, టీడీపీ నేతలు మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ‘ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ లేకపోతే మీ(చంద్రబాబు) ప్రాణాలు పోతాయా? అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా? మీ ప్రాణాలు పోయే పరిస్థితే ఉంటే ఆ స్థానంలో ఇక మీరేందుకు? రాష్ట్రపతిపాలన పెట్టొచ్చు కదా?’ అని ఆమె ప్రశ్నించారు. మీరు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అర్హులేనా?’ అనే పలు ప్రశ్నలు ప్రజల ముందు ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో అక్రమంగా గెలిచి అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబుకు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఓ గుణపాఠం అని అన్నారు.