Sunday, August 18, 2019
Follow Us on :

శ్రీ‌దేవి మ‌ర‌ణంపై స్పందించిన బోనీ క‌పూర్‌

By BhaaratToday | Published On Jul 13th, 2019

- శ్రీ‌దేవి మ‌ర‌ణంపై వ‌స్తున్న అనుమానాలు క‌ట్టుక‌థ‌లే
- ఆధారాలు లేని వార్త‌ల‌పై స్పందించాల్సిన అవ‌స‌రం లేదు
- శ్రీ‌దేవి భ‌ర్త బోనీ క‌పూర్‌

అతిలోక సుందరి శ్రీ‌దేవి మ‌ర‌ణించి ఏడాది దాటినా మ‌ర‌ణంపై ఎన్నో సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న శ్రీ‌దేవి మరణం మరోసారి తెర‌పైకి వ‌చ్చింది. శ్రీ‌దేవిది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, హ‌త్యేన‌ని తాజాగా కేర‌ళ జైళ్ల శాఖ మాజీ డీజీపీ రిషిరాజ్‌సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ్రీదేవిది హత్యేనని, ఆమె మరణంలో కుట్ర కోణం దాగి ఉందంటూ...‘మునిగి చనిపోయి ఉండకపోవచ్చు’ అంటూ ఓ దిన పత్రికకు వ్యాసం రాశారు. అందులో అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మాజీ డీజీపీ వ్యాఖ్య‌ల‌పై బాలీవుడ్‌ నిర్మాత, శ్రీ‌దేవి భ‌ర్త బోనీ క‌పూర్ స్పందించారు. ఆమె మ‌ర‌ణంపై వ‌స్తున్న క‌థ‌నాలు అన్ని కట్టుక‌థ‌లేన‌ని అన్నారు. ఇటువంటివి వస్తూనే ఉంటాయని, ఎటువంటి ఆధారాలూ లేని ఊహాజనిత వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటి మూర్ఖ వాదనలను ఎవరో ఒకరు పుట్టిస్తూనే ఉంటారన్నారు.