Wednesday, November 20, 2019
Follow Us on :

అచ్చం సినిమాల్లో లాగా.. 81 ఏళ్ల ముసలోడిగా 32 ఏళ్ళ వ్యక్తి గెటప్..!

By BhaaratToday | Published On Sep 11th, 2019

అచ్చం సినిమాల్లో లాగా.. ఎయిర్ పోర్టులో అధికారుల కళ్ళు గప్పి తప్పించుకోవాలని విభిన్నమైన గెటప్ లు వేసుకోవడం మనం చూసే ఉంటాం. అలాగే మనోడు ఆ సీన్స్ అన్నిటినీ బాగా చూసి మాంచి ప్లాన్ వేశాడు. 32 ఏళ్ల వ్యక్తి కాస్తా 81 ఏళ్ల వ్యక్తిగా గెటప్ వేసుకున్నాడు. అయితే చివరి నిమిషంలో అనుమానం రావడంతో అడ్డంగా దొరికిపోయాడు. ఇలాంటి సంఘటన ఢిల్లీ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో తాము  ఎప్పుడూ చూల్లేదని సీనియర్‌‌‌‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

Image result for 81 years

జయేష్ పటేల్  అనే 32 సంవత్సరాల యువకుడు అమ్రిక్ సింగ్ పేరుతో  81 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వేషంలో న్యూయార్క్ వెళ్లేందుకు దేశ రాజధానిలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. నెరిసిన జుత్తు.. మాసిన గెడ్డం వేసుకొని తలపాగా ధరించి నడవలేని స్థితిలో ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నాడు. వయోధికుడు కావడంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది కూడా సహాయం చేశారు. కానీ ఎందుకో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. చర్మం కూడా ముడతలు పడలేదు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకోగా మొత్తం విషయం బయటకు వచ్చింది. అమెరికా వెళ్లడానికి అవసరమైన డాక్యుమెంట్లు కోసం భరత్‌‌‌‌ అనే ఏజెంట్‌‌‌‌తో పటేల్‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నాడు. అమెరికాకు వెళ్లగానే రూ.30 లక్షలు పంపిస్తానని ఏజెంట్‌‌‌‌తో  పటేల్‌‌‌‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా పంపించే ముందు ఢిల్లీ హోటల్‌‌‌‌లో పటేల్‌‌‌‌కు ముసలాడిగా ఏజెంట్‌‌‌‌ భరత్‌‌‌‌ మేకప్‌‌‌‌ చేయించాడు. అదే గెటప్‌‌‌‌తో పటేల్‌‌‌‌ హోటల్‌‌‌‌ నుంచి ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌కు నేరుగా వచ్చాడు.  సెక్యూరిటీ చెక్‌‌‌‌, ఇమ్మిగ్రేషన్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌ పూర్తయిన తర్వాత అతడి నడవడికలో తేడాలను గమనించేసి అదుపు లోకి తీసుకున్నారు.    

Image result for 81 years

Image result for 81 years

Image result for 81 years

Image result for 81 years