Wednesday, October 16, 2019
Follow Us on :

ప్రతిభకు భారత్ టుడే పట్టం..! కేటీఆర్ ప్రశంసలు..!!

By BhaaratToday | Published On Feb 5th, 2019

టెన్త్ మాత్రమే చదివాడు... ఆల్కహాల్ డిటెక్టర్ కనిపెట్టాడు... కేటీఆర్‌ని మెప్పించాడు. పదో తరగతి మాత్రమే చదివిన కుర్రాడు ఇంటర్నెట్ సాయంతో తనకు నచ్చిన అంశాన్ని నేర్చుకొని ఆల్కహాల్ డిటెక్టర్ తయారు చేయడం కేటీఆర్‌ను సైతం మెప్పించింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా సపోర్ట్ ఇస్తామని ట్విట్టర్‌లో ప్రకటించారు కేటీఆర్. హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల కుర్రాడు ఆల్కహార్ డిటెక్టర్‌ని కనిపెట్టి కేటీఆర్‌ మెప్పు పొందాడు. అతని పేరు సాయి తేజ. చదివింది పదో తరగతే. కానీ... రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు డ్రైవర్ మద్యం తాగాడా లేదా అని గుర్తించే పరికరాన్ని కనిపెట్టాడు సాయితేజ. ఒకవేళ డ్రైవర్ మద్యం తాగినట్టైతే ఆ పరికరం గుర్తిస్తుంది. ఇంజిన్ పనిచేయకుండా ఆపేస్తుంది. దీంతో వాహనం ముందుకు కదలడం సాధ్యం కాదు. అంతేకాదు... అందులో ముందే ఫీడ్ చేసిన మొబైల్ నెంబర్లకు ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా పంపించడం ఈ పరికరం ప్రత్యేకత. 
పదిహేనేళ్ల వయసులోనే మెదడు రక్తనాళంలో రక్తం గడ్డ కట్టింది. ఆడుతూ పాడుతూ కాలేజీకి వెళ్లాల్సిన వయసులోనే అనారోగ్యం కాటేసింది. కానీ ఇవేవీ ఆ కుర్రాడిని ఆపలేకపోయాయి. ఒక వైపు పేదరికంతో, మరో వైపు అనారోగ్యంతో పోరాడుతూనే టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. పలు వినూత్న పరికరాలకు రూపకల్పన చేశాడు. అతనే జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాయితేజ. ఆయన ప్రతిభను ఇటీవలే భారత్ టుడీ వెలుగులోకి తెచ్చింది. అతనికి యువ సంకల్పదివస్ అవార్డునిచ్చింది. ఇప్పుడు సాయితేజ ప్రతిభ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టిని ఆకర్షించింది. అతనికి ఐటీ రంగంలో ముందుకు వెళ్లేందుకు తోడ్పడాలని ఆయన నిర్ణయించారు. కేటీఆర్ సాయి తేజను ఐటీ రంగంలోకి ఆహ్వానించారు. ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సరికొత్త మేథాసంపత్తికి కలిగిన సాయితేజ ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నాడు. తాను కొన్ని కారణాల వల్ల 10వ తరగతి తర్వాత చదువు మానేశానని చెబుతున్నాడు సాయితేజ. కానీ ఎలక్ట్రానిక్స్ అంటే ఆసక్తి ఎక్కువ. అందుకే ఇంటర్నెట్‌ ద్వారా నేర్చుకున్నాడు. ఇంటర్నెట్‌లోనే కోడ్ నేర్చుకొని ఆల్కహాల్ డిటెక్టర్ సృష్టించాడు. డ్రైవర్ 30 శాతం కన్నా ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే వాహనం ఇంజిన్ స్టార్ట్ కాదు.  
మరోవైపు ఈ పరికరం తయారు చేయడానికి సాయితేజకు 15 రోజుల సమయం పట్టింది. 2500 రూపాయల వరకు ఖర్చయింది. డ్రైవర్ మద్యం తాగితే వాహనం ఇంజిన్‌ను ఆపెయ్యడమే కాదు.. అందులోని మైక్రో కంట్రోలర్‌లో సేవ్‌ చేసిన ఫోన్ నెంబర్లకు ఎస్ఎంఎస్ వెళ్లేలా దీన్ని రూపొందించాడు. పదో తరగతి మాత్రమే చదివిన కుర్రాడు ఇంటర్నెట్ సాయంతో తనకు నచ్చిన అంశాన్ని నేర్చుకొని ఆల్కహాల్ డిటెక్టర్ తయారు చేయడం కేటీఆర్‌ను సైతం మెప్పించింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా సపోర్ట్ ఇస్తామని ట్విట్టర్‌లో ప్రకటించారు కేటీఆర్. మనలో దాగి ఉన్న ప్రతిభను చూపించడానికి చదువు ఒక్కటే మార్గం కాదని నిరూపించాడు సాయితేజ. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సపోర్ట్‌తో సాయితేజ మరిన్ని అద్భుతాలు ఆవిష్కరించాలని ఆశిద్దాం.