Friday, March 22, 2019
Follow Us on :

దర్యాప్తు తీరు బాధాకరం.. లెటర్ ఎలా రాస్తాడంటూ జగన్ ప్రశ్న

By BhaaratToday | Published On Mar 15th, 2019

వైఎస్ వివేకానంద హత్య అత్యంత నీచమైన చర్య ఇది అని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. సౌమ్యుడిగా పేరు పొందిన ఒక మాజీ మంత్రిని ఇంట్లోకి వచ్చి.. గొడ్డలి తీసుకొని వచ్చి చంపడం అత్యంత దారుణమని జగన్ చెప్పారు. ఇంత ఘోరమైన ఘటన జరిగినా విచారణ జరుగుతున్న తీరులోనే చాలా తప్పు ఉందని జగన్ చెప్పుకొచ్చారు. ఆయన చనిపోతూ ఓ లెటర్ రాశారని పోలీసు అధికారులు చూపించారని.. అది ఎలా సాధ్యం అవుతుందని జగన్ ప్రశ్నించారు. తన చిన్నాన్నను బెడ్ పక్కన గొడ్డలితో నరకడం జరిగిందని.. అంతగా నరికిన తర్వాత.. బాత్ రూమ్ కు తీసుకొని వెళ్ళారని.. కబోర్డ్ కు రక్తం పూసేలా మొత్తం మేనిప్యులేట్ చేశారని జగన్ ఆరోపించారు. ఆయన్ను ఎత్తుకుని వెళ్లారు అంటే.. ఈ ఘటనలో పలువురు ఉన్నారని జగన్ చెప్పుకొచ్చారు. లెటర్ రాసే వరకూ హంతకులు తన చిన్నాన్నను ఎలా వదులుతారు అని జగన్ చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరపాలని జగన్ కోరారు. నిజాలు బయటకు రావాలి.. ఈ పని చేసిన వారు ఎవరైనా వారి మూలాల దగ్గరకు తీసుకొని వెళ్లాలని చెప్పారు. 

 
తన తాతను చంపారని.. ఆ తర్వాత తన తండ్రిని చంపడంపై కూడా అనుమానాలు ఉన్నాయని.. తనను కూడా చంపాలని ప్రయత్నించారని జగన్ ఆరోపించారు. ఈ అన్ని ఘటనల్లోనూ చంద్రబాబు నాయుడు కామన్ గా ఉన్నారని జగన్ చెప్పుకొచ్చారు. సీబీఐను ఏర్పాటు చేస్తేనే నిజం బయటకు వచ్చే అవకాశం ఉందని జగన్ చెప్పుకొచ్చారు. న్యాయం జరగాలి అంటే.. చంద్రబాబు నాయుడుకు రిపోర్ట్ చేయని వారితో ఎంక్వయిరీ చేయించాలని జగన్ అన్నారు. వైసీపీ కార్యకర్తలందరికీ తాను ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నానని.. రెచ్చిపోయి ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని సూచించారు.