Tuesday, May 21, 2019
Follow Us on :

చంద్రబాబు తన రెండు వేళ్లు చూపిస్తుంది ఇందుకేనా..

By BhaaratToday | Published On Apr 2nd, 2019

రోజుకో మాట, పూటకో వేషం చంద్రబాబుది అని, అందుకే, తనరెండు వేళ్లను చూపిస్తూ ఉంటారని వైసీపీ నాయకురాలు షర్మిళ ఎద్దెవా చేశారు. ఎన్నికల సంద‌ర్భంగా ఈ రోజు ఆమె  కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వ‌హించి మాట్లాడారు. చంద్రబాబు తన రెండు వేళ్లు చూపిస్తుంటే, ఏదో అనుకున్నాం కానీ, ఇప్పుడు అర్థమైందని, ఆయనది రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు. ఏపీకి ‘ప్రత్యేకహోదా’ ను నీరు గార్చింది చంద్రబాబే అని, ఆ ‘హోదా’ సాధన కోసం నిరంతరం పోరాడుతోందని జగన్ అని అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలన్న చంద్రబాబు, మళ్లీ ప్రత్యేక హోదా కావాలని ఆయన అడగడానికి కారణం జగనే అని, ‘దమ్ముంటే, చంద్రబాబు నిజం చెప్పాలి? కానీ, ఆయనకు దమ్ము లేదు’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మోస‌పూరిత పాల‌న కొన‌సాగుతోంద‌ని, చంద్ర‌బాబు జ‌నాల‌ను మోసం చేయ‌డం త‌ప్పా..ఇంకేం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.