Friday, July 19, 2019
Follow Us on :

మొన్న పాల్ చైన్.. ఇప్పుడు షర్మిళ ఉంగరం

By BhaaratToday | Published On Mar 31st, 2019

మొన్నటికి మొన్న కె.ఏ.పాల్ చైన్ ను లైవ్ లోనే కొట్టేయడం చూసి నెటిజన్లు తెగ నవ్వుకున్నారు. ఆయన ఏదో మాట్లాడుతూ ఉండగానే.. మెడలో నుండి చైన్ ను లాగేశారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళ ఉంగరాన్ని కొట్టేయాలని చూశారు. షర్మిళ చేతి ఉంగారాన్నే కొట్టేయాలని ప్రయత్నించాడో దొంగ. శనివారం షర్మిల మంగళగిరి నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. రోడ్డు పక్కన ఉన్న వైసీపీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ, చేతులు కలుపుతూ ముందుకు సాగారు. షర్మిళ  ఉత్సాహంగా వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉండగా ఓ వ్యక్తి తన దొంగతనం టాలెంట్ ను చూపించడానికి ప్రయత్నించాడు. షర్మిళకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఆమె వేలికి ఉన్న ఉంగరాన్ని కొట్టేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఆమె చేయిని గట్టిగా విదిలించుకున్నారు. ఉంగరం వేలికి కాస్తా బిగుతుగా ఉండడంతో ఉంగరం షర్మిళ చేతికే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.