Tuesday, May 21, 2019
Follow Us on :

అజాత శత్రువుని దారుణంగా చంపేశారు..!

By BhaaratToday | Published On Mar 15th, 2019

వివేకానంద రెడ్డి మరణించాడన్న వార్త బయటకు రాగానే పలు అనుమానాలకు తావిచ్చింది. అందరూ పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూశారు. పోస్టుమార్టం నివేదికలో ఆయనది హత్యేనని తేల్చేశారు. వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్లు సమాచారం. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. పదునైన ఆయుధంతో శరీరంపై దాడి చేశారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. పోలీసులు, అధికారులు మాత్రం ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. పదునైన ఆయుధంతో వైఎస్‌ వివేకానందరెడ్డి తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు గుర్తించారు. నుదుటిపై లోతైన రెండు గాయాలు, తల వెనక భాగంలో మరో గాయం, తొడ భాగం, చేతిపైనా మరో గాయం అయినట్లు తెలుస్తోంది.

రిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం పులివెందులలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. వివేకా నివాసం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు.