Tuesday, May 21, 2019
Follow Us on :

వివేకానంద హ‌త్య కేసులో మ‌రో కోణం..!

By BhaaratToday | Published On Mar 16th, 2019

మాజీ మంత్రి, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తచ్చాడే ఓ కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. ఆ ప్రాంతంలో కొత్త వ్యక్తులు కనబడితే మొరిగే ఈ శునకాన్ని వివేకా హ‌త్య ప్లాన్‌లో భాగంగానే హత్య చేసినట్టు చెబుతున్నారు. అది ఉంటే ఆ ప్రాంతంలోకి వెళ్లడం కష్టమనే ఉద్దేశంతో ముందుగానే దానిని చంపేసినట్టు తెలుస్తోంది. హత్యకు ముందు నిర్వహించిన రెక్కీలో ఈ కుక్కను గమనించిన దుండగులు దానిని చంపేసి వివేకా హత్యకు పథకం పన్నినట్టు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.

కాగా, పోస్టుమార్టం నివేదిక వచ్చే కొద్ది ముందు వరకు వివేకా గుండెపోటుతో మరణించారన్న ప్రచారం జరిగింది. అయితే, ఆయనది హత్యేనని, గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారని తేలడంతో అందరూ విస్తుపోయారు. ఈ హత్య విషయంలో చంద్రబాబు హస్తం ఉండొచ్చని వైసీపీ చీఫ్ జగన్ పరోక్షంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసేందుకు నేడు గవర్నర్‌ను కలవనున్నారు.