Tuesday, May 21, 2019
Follow Us on :

ర‌విప్ర‌కాష్ పై విజ‌య‌సాయి రెడ్డి సెటైర్లు.. రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగి..

By BhaaratToday | Published On May 15th, 2019

ఒక‌ప్పుడు టీవీ9 లో ఓ వెలుగు వెలిగిన‌ టీవీ9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాష్ కు ప్ర‌స్తుతం ఓ రేంజ్ లో బ్యాడ్ టైం న‌డుస్తుంది. పోర్జ‌రీ కేసు, కొత్త యాజ‌మాన్యం చేతిలో చావుదెబ్బ తిన‌డం, తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డానికి య‌త్నించ‌డం ఇలా పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఇరుక్కుని ఊపిరి ఆడ‌నంత లోతు ఊబిలో కూరుకుపోయారు. అస‌లే అజ్ఞాతంలో త‌ల‌దాచుకు తిరుగుతున్న ర‌విప్ర‌కాష్ పై 'మూలిగే న‌క్క మీద తాటి పండు'  అన్న  చందంగా వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి ట్విట‌ర్ వేదిక‌గా వ‌రుస ట్వీట్ల‌తో ప‌లు సెటైర్లు వేశారు. 

విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ లో.. "పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్‌ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్‌. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి.

నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం పరారైపోయింది! విచారణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవిప్రకాష్‌ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే ‘నకిలీ ప్రవక్త’ రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్‌ దాటేశాడు. రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూద్దాం అంటాడేమో! త‌న ట్వీట్ల‌తో ర‌విప్ర‌కాష్ పై విరుచుకుప‌డ్డారు.