Tuesday, October 15, 2019
Follow Us on :

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన జగన్..! వైసీపీ అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు..!!

By BhaaratToday | Published On Jan 31st, 2019

హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అన్న పిలుపు కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని హంగ్ వచ్చే అవకాశం ఉందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కేంద్రంలో హంగ్ ఏర్పడితే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు ఏ పార్టీతో పొత్తు ఉండదని జగన్ స్పష్టం చేశారు. హోదా కోసం ఎవరు సంతకం పెడితే వారికే మద్దతు ఇస్తామని వైసీపీ అధినేత వెల్లడించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రైల్వే జోన్ రావాల్సి ఉందన్న జగన్.. హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్లాంట్ కోసం పోరాటం చేస్తామన్నారు. నవరత్నాలను బాబు కాపీ కొడుతున్నారని జగన్ ఆరోపించారు. ఆయనెంత కాపీ కొట్టిన జనం నమ్మరని వైసీపీ అధినేత అన్నారు.