Wednesday, October 16, 2019
Follow Us on :

జగన్ కు తలనొప్పిగా మారిన హిందూపురం..!

By BhaaratToday | Published On Feb 1st, 2019

అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపీక సంచలనంగా మారిపోయింది. నేతల మధ్య పంచాయితీ నేరుగా జగన్ దగ్గరకు వెళ్లింది. టికెట్ ఎవరికి ఇస్తార అనే విషయమై పార్టీ కార్యకర్తలు నేరుగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు బయల్దేరారు. అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలలో బీసీ, మైనార్టీలకి ఒక్కో సీటును కేటాయించాలని వైసీపి అధినేత జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా గత నాలుగున్నరేళ్లుగా హిందూపురం అసెంబ్లీ సమన్వయకర్తగా నవీన్ ఉన్నారు. అయితే రెండు నెలల క్రితం నవీన్ ను తొలగించి టీడిపి నుండి వచ్చిన అబ్దుల్ ఘనీకి వైసీపీ అదిస్టానం అసెంబ్లీ పరిధి కో-ఆర్డినేటర్ బాధ్యతలను  అప్పగించింది. దీంతో తనను పక్కకు తప్పించారంటూ నవీన్ నిశ్చల్ మద్దతుదారులతో కలిసి అసెంబ్లీ అభ్యర్థిగా సీటు తనకే కేటాయించాలంటూ లోటస్ పాండ్ లో ప్రదర్శన చేశారు. ఓడిపోయే అసెంబ్లీ స్థానం మాకొద్దు.. గెలిచే పార్లమెంటు స్థానం మాకివ్వండి అంటూ మైనార్టీలంతా జగన్ వద్దకు తమ మతపెద్దలను రాయబారం పంపారు. ముస్లీంమత పెద్దలతో దాదాపు మూడు గంటల పాటు జగన్ చర్చలు జరిపి, హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని వారిని శాంతింపజేశారు. పది రోజుల్లో హిందూపురం అభ్యర్థిని ఖరారు చేస్తామని, ఇప్పుడున్న సమన్వయ కర్తను మార్చే ఆలోచనను పునపరిశీలిస్తానని జగన్ తమకు హామీ ఇచ్చినట్టు మతపెద్దలు చెబుతున్నారు. హిందూపురం పార్లమెంటు సమన్వయకర్తగా జగన్ ముందుగా నదీంను నియమించారు. అయితే తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ వైసీపి కండువా కప్పుకున్నారు. దీంతో హిందూపురం పార్లమెంటు సమన్వయ కర్తగా గోరంట్ల మాధవ్ ను జగన్ ఎంపీక చేశారు. ఇక పార్లమెంటు స్థానం మైనార్టీలకు లేదని స్పష్టం అర్ధమవడంతో..  నదీంకు గానీ నవీన్ నిశ్చల్ కి గానీ సీటు కేటాయించాలనే వైసీపీలోని క్యాడర్ డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు జగన్ తమకు స్పష్టంగా హామీ ఇచ్చారని, హిందూపురం వెళ్లిపోతున్నట్లు మైనార్ట్రీ నేతలంటున్నారు. లోటస్ పాండ్ లో హిందూ పంచాయితీ ఓ వైపు నడుస్తూంటే... కడప జిల్లా రాజంపేట మాజీ ఎమ్మెల్యే అరికేపాటి అమర్నాథ్ రెడ్డీ లోటస్ పాండ్ లో జగన్ ను సమావేశమయ్యారు. మేడా మల్లికార్జున రెడ్డికి జగన్ సీటు విషయమై అమర్నాథ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు గాను జగన్ అమర్ నాధ్ రెడ్డితో చర్చలు జరిపి శాంతింపజేశారు.